భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం సోమవారం జరిగిన పోలింగ్‌కు సంబంధించి 99.18 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ మేరకు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ సోమవారం సాయంత్రం పోలింగ్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ను ఢిల్లీలోని పార్లమెంటుతో పాటు ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో నమోదైన పోలింగ్ వివరాలను మాత్రమే పీసీ మోదీ వెల్లడించారు.
ఢిల్లీలోని పార్లమెంటు పోలింగ్ కేంద్రంలో మొత్తంగా 736 మంది ఓట్లు వేయాల్సి ఉంది. వీరిలో ఎంపీలు 727 మంది ఉండగా... ఆయా రాష్ట్రాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలకు డిల్లీలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. వెరసి మొత్తంగా 736 ఓట్లు ఉండగా... 730 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మరో 6 ఓట్లు పోల్ కాలేదు. ఫలితంగా ఢిల్లీలో 99.18 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని పీసీ మోదీ చెప్పారు.
Polling for the 16th Presidential election commenced at 10am & closed at 5pm. Of 736 electors incl 727 members of parliament & 9 legislative assembly members permitted by EC to vote, 730 cast their votes. Voter turnout of 99.18% registered: PC Mody, Secy Gen, Rajya Sabha pic.twitter.com/KPGaGwsVXw
— ANI (@ANI) July 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)