హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ బుధవారం తన రాజీనామాను సమర్పించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుఖూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తమ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని సూచించింది.
15 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై హిమాచల్ స్పీకర్ ఇవాళ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాల వేళ వారిని ఆయన బహిష్కరించారు. స్పీకర్ ఛాంబర్ వద్ద నినాదాలు చేయడంతో ఆయన ఆ చర్యకు పాల్పడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడంతో హిమాచల్‌లో రాజ్యసభ సీటును బీజేపీ నెగ్గిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ సీఎంకు పదవీ గండం, అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందే అంటూ గవర్నర్ ను కలిసిన బీజేపీ, రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో సంక్షోభం
Here's News
#Himachal CM Sukhvinder Singh Sukhu resigns amid #Congress rebellion https://t.co/tbwD3JTYUy
— India Today NE (@IndiaTodayNE) February 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)