తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందరిని కలుపుకుని, ముందుకు నడిపించే సామర్థ్యాలు ఉన్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో సమావేశమై బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలపై సమాలోచనలు చేయడం తెలిసిందే. దీనిపై సంజయ్ రౌత్ సోమవారం నాగపూర్ లో స్పందించారు. సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

‘‘కే చంద్రశేఖర్ రావు ఎంతో కష్టపడి పనిచేసే రాజకీయ నేత. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అందరికనీ కలుపుకునిపోయే, నాయకత్వం వహించే సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి’’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఇద్దరు సీఎంలు (కేసీఆర్,ఠాక్రే), ఇతర రాజకీయ నాయకులు త్వరలోనే సమావేశమై చర్చలు నిర్వహిస్తారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి పాలు కాబోతోందని ఈ సందర్భంగా రౌత్ అన్నారు.

కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేం ఎప్పుడూ చెప్పలేదు. మమతా బెనర్జీ రాజకీయ ఫ్రంట్‌ను సూచించిన సమయంలో, కాంగ్రెస్‌ను వెంట తీసుకెళ్లాలని మాట్లాడిన మొదటి రాజకీయ పార్టీ శివసేన. అందరినీ వెంట తీసుకెళ్లి నడిపించే సత్తా కేసీఆర్‌కు ఉందని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)