మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చవాన్ రాజీనామా ఘటన మరువక ముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత విభాకర్ శాస్త్రి తన ప్రకటనలో, “ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో , లాల్ బహదూర్ శాస్త్రి యొక్క ‘జై జవాన్, జై కిసాన్’ విజన్‌ని మరింత బలోపేతం చేయడం ద్వారా నేను దేశానికి సేవ చేయగలనని భావిస్తున్నానని తెలిపారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కకపోవడంతో విభాకర్ శాస్త్రి మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇవాళే బీజేపీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.ప్రియాంక గాంధీకి విభాకర్ శాస్త్రి సలహాదారుగా ఉన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయంపై మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి కొంతకాలంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 ఆగస్టులో పార్టీ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Here's ANI Videos
#WATCH | Vibhakar Shastri says, "...I think under the leadership of PM Narendra Modi, I will be able to serve the country by further strengthening Lal Bahadur Shastri's vision of 'Jai Jawan, Jai Kisan'..." https://t.co/6zSgwzSJhQ pic.twitter.com/nSdWwnHXIX
— ANI (@ANI) February 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)