అయ్యప్పస్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి/మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు.తాజాగా మకర సంక్రాంతి పర్వదినమైన సోమవారం సాయంత్రం 6.47 గంటలకు కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది.

మొత్తం మూడుసార్లు జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి.సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించారు. భక్తులు జ్యోతిని దర్శించుకునేందుకు ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్‌లో కొన్ని కోట్ల మంది జ్యోతి దర్శనం చేసుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)