దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రధాని ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు దీపావళిని జరుపుకొంటారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని ప్రార్థించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)