హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ (New York) ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా (School Holiday) ప్రకటించింది.ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ( Eric Adams) సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. ‘దీపావళి పర్వదినాన స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్‌కుమార్, సంఘం నాయకులకు అండగా నిలిచినందుకు గర్వపడుతున్నాను. ఈ ప్రకటనతో దీపావళి ముందుగానే వచ్చినట్లయ్యింది’ అని మేయర్ ఎరిక్ అన్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)