పర్యాటక మంత్రి రోజా చిత్తూరు జిల్లాలోని నగరిలో గడపగడపకు మన ప్రభుత్వం (gadapa gadapaku mana prabhutvam) కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో తనకు తోడు ఎవరూ లేరని.. ఒంటరిగా బతకలేకపోతున్నానని ఓ వృద్ధుడు రోజా ఎదుట మొరపెట్టుకున్నాడు. తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా మంత్రి రోజానే అడిగాడు. వృద్ధుడి కోరిక విన్న రోజా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పెన్షన్ అయితే ఎలాగోలా ఇప్పిస్తాం.. కానీ పెళ్లి చేయలేమంటూ మంత్రి రోజా వృద్ధుడితో పేర్కొన్నారు. అయితే.. పింఛన్ వస్తుంది కానీ.. నీడ, తోడు లేదంటూ మంత్రికి చెప్పాడు. అయితే.. వృద్ధుడి కోరిక విని.. అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఈ ఘటన పుత్తూరు మండలం శిరుగురాజుపాలెంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై రోజా ప్రతి ఇంటికి వెళుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుడి కోరిక విన్న.. నాయకులంతా నవ్వుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్ అవుతోంది.
*చిత్తూరు జిల్లా*
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో... మంత్రి రోజా కు వింత అనుభవం...ఫించన్ వస్తోంది కానీ నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరని,తనకు పెళ్ళిచేయాలని కోరిన వృద్ధుడు...🙆🙆🙆🙆🙆 pic.twitter.com/diThJk6rdm
— JPR Is Back (@JPRisBack) May 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)