బీహార్ లో పిల్లనిచ్చిన అత్తను ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న విచిత్రకర ఘటన చోటు చేసుకుంది.  ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.45 ఏళ్ల సికందర్ యాదవ్ కు గతంలో పెళ్లయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతని భార్య చనిపోవడంతో తన పిల్లలను తీసుకొని అత్తారింట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో 55 ఏళ్ల అత్త గీతా దేవితో అతనికి సాన్నిహిత్యం పెరిగింది.

అది కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే వారు సన్నిహితంగా మెలుగుతుండటాన్ని గుర్తించిన సికందర్ మామ దిలీశ్వర్ దార్వేకు వారిపై అనుమానం కలిగింది. ఒకరోజు వారిద్దరి గుట్టు రట్టు చేశాడు. వెంటనే ఈ విషయంపై గ్రామ సర్పంచ్ సమక్షంలో పంచాయితీ పెట్టాడు. సికందర్ యాదవ్ అందరి ముందు తాను అత్తను ప్రేమిస్తున్నట్లు ప్రకటించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని మనసులో మాటను బయటపెట్టాడు. దీంతో ఇక చేసేది లేక మామ కూడా అందుకు ఒప్పుకోవడంతో గ్రామస్తుల సమక్షంలో సికందర్ అత్త నుదుటిన సిందూరం దిద్దాడు. విచిత్రమేమిటంటే మామే ఈ పెళ్లి దగ్గరుండి జరిపించటం.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)