బీహార్ లోని నలంద జిల్లాలో జనాల దగ్గరి నుంచి వసూలు చేసిన లంచం పంపకాల విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య వివాదం రేగింది. మాటామాటా పెరగడంతో హైవే పైన తమ వాహనాన్ని ఆపి ఇద్దరూ కిందకు దిగి మరీ కొట్టుకున్నారు. చొక్కాలు పట్టుకుని మరీ పోలీసులు కొట్టుకుంటుండంతో హైవే పైన వెళుతున్న వాహనదారులు ముక్కున వేలేసుకున్నారు. ఇదంతా అక్కడున్న వారు తమ మొబైల్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో బీహార్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. రోడ్డు మీద కొట్టుకున్న ఆ పోలీసులు ఇద్దరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇప్పటికే వారిద్దరినీ పోలస్ సెంటర్ కు పిలిపించామని, విచారణ జరిపి ఇద్దరిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, ఆ పోలీసులు ఇద్దరినీ వెంటనే సస్పెండ్ చేయాలని కొంతమంది నెటిజన్లు డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వారిద్దరినీ శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని అంటున్నారు.

Bihar Police Suspend Two Police Personnel After Video of Them Fighting on Road in Nalanda Goes Viral

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)