బీహార్‌లోని సుపాల్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ తీసుకువచ్చాడు.రాగానే మూడవ తరగతి విద్యార్థిపై కాల్పులు (Boy Shoots Student In School) జరిపాడు. దీంతో ఆ స్టూడెంట్‌ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు చేరుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లాల్‌పట్టి ప్రాంతంలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఐదేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు.  వీడియో ఇదిగో.. హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌పై దాడి, పోలీసులతో పాటు నిందితుడిపై ఎటాక్, పలువురు పోలీసులకు గాయాలు

బుధవారం స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ దాచి పాఠశాలకు వచ్చాడు. మూడో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిపై ఆ గన్‌తో కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థి అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతడి చేతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనపై కాల్పులు జరిపిన బాలుడితో ఎలాంటి గొడవ జరగలేదని ఆ విద్యార్థి చెప్పాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రైవేట్‌ స్కూల్‌ వద్దకు చేరుకున్నారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన బాలుడు, అతడి తండ్రి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Here's Video

Police Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)