Gujarat Bridge Collapse: గుజరాత్‌ను గత మూడు రొజుల నుంచి భారీ వర్షాలు (Gujarat Rains) వణికిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. భారీ వరదలకు పలు నగరాల్లో ప్రధాన రహదారులపై నడుము లోతు నీరు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నదులు, డ్యాముల్లో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో ఆయా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. తాజాగా సురేంద్రనగర్‌ (Surendranagar) జిల్లాలోని భోగావో నదిపై (Bhogavo river) ఉన్న చిన్న వంతెన వరద ఉద్ధృతికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

100 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన హబియాసర్‌ గ్రామాన్ని చోటిలా పట్టణంతో అనుసంధానిస్తోంది.భారీ వరద ఉద్ధృతికి వంతెన కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు’ అని చోటిలా సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ కేకే శర్మ తెలిపారు. బ్రిడ్జ్‌ కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.  వీడియో ఇదిగో, అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న గంగానది, అప్రమత్తమై పాట్నాలో 76 స్కూళ్లను ఆగస్టు 31 వరకు బంద్ చేసిన అధికారులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)