ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో రైసెన్ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది.నత్తులాల్ శిల్పాకర్ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది.ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది.ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు. అయితే ఆ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడిందని చెప్పారు. చనిపోయిన సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామానికి సుదూరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)