Newdelhi, Dec 30: లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections) సమీపిస్తున్న వేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో (Promotions) రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 2016, జూన్ 30వ తేదీ నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. అయితే ప్రమోషన్లకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు సదరు ఉద్యోగి ప్రమోషన్ పోస్టులో చేరిన రోజు నుంచి అమలవుతాయని తెలిపింది. అంటే నోషనల్ ప్రమోషన్ పొందిన తేదీ నుంచి నిజంగా ప్రమోషన్ తో కొత్త పోస్టులో చేరేవరకు మధ్య గల కాలానికి సంబంధించి ఉద్యోగికి ఎలాంటి ప్రయోజనాలు అందవు.
Department of Personnel & Training: Reservation in.promotion to Persons with Benchmark Disabilities (PwBDs)..#Disabled pic.twitter.com/BDGMe1NKPN
— Hari Krishnan Pongilath (@h_pongilath) December 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)