సెప్టెంబర్‌ 25న జరిగిన ఓ ఘటనలో నడిరోడ్డుపై సహా యజమాని అయిన యువతి పట్ల స్పా నిర్వాహకుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె జుట్టుపట్టకొని లాగి దాడి చేశాడు. యువతి దుస్తులు చింపుతూ, చెంపదెబ్బలు కొడుతూ వేధింపులకు గురిచేశాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.అహ్మదాబాద్‌కు చెందిన గాలక్సీ స్పా యజమాని మొహ్సిన్ తన షాప్‌ ముందు బిజినెస్‌ పార్టనర్‌ అయిన 24 ఏళ్ల యువతిపై దాడి చేశాడు. లోని స్పా ఎదుట యువతితో యాజమానికి గొడవకు దిగాడు.

ఈ వీడియోలో రాత్రిపూట నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై మొహ్సిన్ యువతిపై పదేపదే దాడి చేయడం కనిపిస్తోంది. ఓ సామాజిక కార్యకర్త ద్వారా సమాచారం అందుకున్న బోడక్‌దేవ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతిని రక్షించారు. తరువాత ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించేశారు. అయితే అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. వ్యాపారంలో భాగంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది హింసాత్మకంగా మారినట్లు పోలీసులు గుర్తించారు.

Ahmedabad Spa Manager Brutally Assaults Woman, Drags Her By Hair (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)