Taxi Driver Saves Monkey Life With CPR: సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వైరల్ అవుతున్న వీడియో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. వీడియోలో ఓ ట్యాక్సీ డ్రైవర్ సీపీఆర్ చేసి కోతి ప్రాణాన్ని రక్షించాడు. ఓ కోతి సృహతప్పి ప్రాణం పోయే స్థితిలో అచేతనంగా పడి ఉంది. అటుగా వెళుతున్న ట్యాక్సీ డ్రైవర్ వానరాన్ని చూసి దాన్ని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. తన నోటితో కోతి నోటిలో గాలి ఊది కోతి ప్రాణాన్ని కాపాడారు. నెటిజన్లు ఈ వీడియో చూసి శభాష్ సార్..మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి మీరే నిదర్శనం అని కొనియాడుతున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై మాత్రం సమాచారం లేదు. అయితే ఈ వీడియో 2021 నాటిది. మళ్లీ నెటిజన్లు షేర్ చేసి మానవత్వం గురించి కామెంట్లు చేస్తున్నారు. వైరల్ వీడియో 2021 నాటి వీడియో లింక్ ఇది.
Here's Video
Incredible moment taxi driver brings a monkey back to life with CPR pic.twitter.com/oTUOKhqQCd
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
