Bengaluru, Dec 19: కర్ణాటకలో (Karnataka) దారుణ ఘటన జరిగింది. కోలార్ జిల్లా యలువహళ్ళి లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్ లో దళిత విద్యార్థులతో (SC Students) స్కూలు అధికారులు బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ (Septic Tank) శుభ్రం చేయించారు. ఈ ఘటనపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో సీఎం సిద్ధరామయ్య జోక్యం చేసుకొని సమగ్ర విచారణకు ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపల్ భారతమ్మ, టీచర్ మునియప్ప, హాస్టల్ వార్డెన్ మంజునాథ్, అతిథి టీచర్ అభిషేక్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. భారతమ్మ, మునియప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Students Made To Clean Septic Tank In Karnataka School, Principal Arrested https://t.co/x08kgtZTS2 pic.twitter.com/Y4Z3qQcFH4
— NDTV (@ndtv) December 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)