Navaratri Puja at Sharada Temple: స్వాతంత్ర్యం తరువాత తొలిసారిగా కశ్మీర్ లోని శారదా మాత దేవాలయంలో పూజలు.. సోమవారం కన్నులపండువగా సాగిన కార్యక్రమం
జమ్ముకశ్మీర్ లో సోమవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కుప్వారా జిల్లా టీట్వాల్ గ్రామంలోని చారిత్రక శారదా మాత దేవాలయంలో 1947 తరువాత తొలిసారిగా నవరాత్రి పూజ నిర్వహించారు.
Newdelhi, Oct 17: జమ్ముకశ్మీర్ లో (Jammu Kashmir) సోమవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కుప్వారా జిల్లా టీట్వాల్ గ్రామంలోని చారిత్రక శారదా మాత దేవాలయంలో (Sharada Temple) 1947 తరువాత తొలిసారిగా నవరాత్రి పూజ నిర్వహించారు. సరిహద్దుకు సమీపాన ఉన్న ఈ దేవాలయంలో పూజలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ దేవాలయ పునరుద్ధరణలో హోం మంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు. మార్చి 23న ఆయన వర్చువల్ గా దేవాలయాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న స్థలంలోనే, అప్పటి డిజైన్ ఆధారంగానే నూతన దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. నాటి కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
Kashmir: Navratri Celebrations Held At Sharda Temple At LoC For First Time In Last 75 Years #JAMMU_AND_KASHMIR #NAVRATRI_PUJA #ENTERTAINMENT https://t.co/F1evzvqLDK
— hardik (@hardik97494342) October 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 17, 2023 09:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

