నార్త్ కొరియాను గత నెలలో భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు సుమారు 4 వేల మంది చనిపోయారని, 5 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. ఈ వరదలను అడ్డుకోవడంలో విఫలం అయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు నార్త్ కొరియా అధినేత. పాకిస్థాన్‌లో వరదలు, 293 మంది మృతి, 564 మందికి గాయాలు, రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
పార్టీ ఛాగాంగ్ ప్రావిన్స్ మాజీ కార్యదర్శి సహా మొత్తం 30 మంది ఉన్నతాధికారులకు కిమ్ మరణ శిక్ష విధించారని, గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి మరణ శిక్ష విధించినట్లు తాజాగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు.
Here's Video
Kim Jung Un heading out to lead a rescue party in the flooded region of North Korea 😎#KimJungun #NorthKorea #Sinuiju #Phyongan #북한 #flooding pic.twitter.com/AHamBfTzlj
— Mrgunsngear (@Mrgunsngear) August 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)