Bengaluru, Oct 31: బెంగళూర్ (Bengaluru) నగరంలోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో స్ధానికులు భయంతో వణికిపోతున్నారు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని వీధుల్లో చిరుత (Leopard) ప్రత్యక్షం కావడంతో ఆ ప్రాంత వాసులను ఇండ్లలోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు. తమ పిల్లల భద్రత కోసం తగిన జాగ్రత్తలు పాటించాలని తల్లితండ్రులను కోరుతూ స్కూల్ నిర్వాహకులు ఈమెయిల్ పంపారు. సింగసంద్ర ప్రాంతంలో చిరుత కనిపించిందని తమ దృష్టికి వచ్చిందని, అయితే ఇప్పుడు అది జీబీ పాళ్యం వద్ద తిరుగాడుతోందని తెలిసిందని మెయిల్ లో పేర్కొన్నారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ కసరత్తు సాగిస్తోందని తెలిపారు.
Leopard spotted near Bengaluru's MS Dhoni International School, high alert in area #bangalore #NammaBengaluru #Bengaluru #leopard pic.twitter.com/1pT4Krjtqb
— Karnataka Portfolio (@karnatakaportf) October 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)