కర్ణాటకలోని ముదుర్ ప్రాంతానికి చెందిన మార్షల్ ఆర్టిస్ట్ కేవీ సైదలవి ఒక్క నిమిషంలో 42 కొబ్బరికాయలను నాన్ చాకుతో పగలగొట్టాడు.చుట్టూ కూర్చున్నవారు తలపై కొబ్బరికాయలు పగిలిన కొద్దీ మరొకటి పెట్టుకుంటూ ఉండగా.. సైదలవి వాటిని పగలగొడుతూ వచ్చాడు. కేవలం నిమిషం వ్యవధిలోనే ఈ కార్యక్రమాన్ని ముగించాడు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. సైదలవి మొదట మెల్లగా మొదలుపెట్టినా తర్వాత వేగం అందుకున్నాడని.. ప్రపంచ రికార్డు సృష్టించాడని గిన్నిస్ ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ‘‘అవేదో కోడిగుడ్లు అన్నట్టుగా పగలగొట్టేస్తున్నాడు. కొబ్బరికాయలను తలపై పెట్టి కొట్టడమేంటి?” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)