Jakarta, Dec 5: ఇండోనేసియాలోని (Indonesia) అతి ఎత్తయిన అగ్నిపర్వతం (Volcano) ‘మౌంట్ సెమేరు’ (Mount Semeru) వరుసగా మూడో ఏడాది బద్దలైంది. దీంతో ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ (Smoke) కమ్ముకుని చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అలాగే, దాదాపు 19 కిలోమీటర్ల మేర బూడిద (Ash) వ్యాపించింది. అప్రమత్తమైన అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 2 వేల మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దీంతో పర్వతం చుట్టూ 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్ (Danger Zone) గా ప్రకటించారు. అగ్ని పర్వతం నుంచి వెలువడుతున్న పొగ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Mount Semeru erupts in Indonesia today, forcing around 2,000 people to evacuate the surrounding area.#APGSemeru #GnSemeru #semeru #eruptionpic.twitter.com/QI2ZTIao6r
— MetWatch (@MetWatchUK) December 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)