ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఆరుగురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఇక ఫైనల్ మ్యాచ్ హీరో విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు.
ఐసీసీ జట్టులో భారత క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. భారత్ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఆ జట్టు నుంచి రహ్మానుల్లా గుర్బాజ్, ఫజల్‌హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్‌లకు ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి స్టోయినిస్.. వెస్టిండీస్ నుంచి పూరన్‌లకు ఛాన్స్ దక్కింది. 12వ ఆటగాడిగా సఫారీ స్పీడ్ గన్ నోర్జే ఎంపికయ్యాడు.
Here's News
Conquering the world, and dominating the #T20WorldCup Team of the Tournament 🙌
More as six of India's champions make the XI 📝https://t.co/bSJFWHPivI
— ICC (@ICC) July 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)