ఆస్ట్రేలియాలో క్రిస్మస్ ఐలాండ్‌లో లక్షలాది పీతలు (Red Crabs) వలస వెళ్తూ.. రోడ్లపైకి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ ప్రాంత దారులన్నీ స్థానిక అధికారులు మూసివేశారు.ఈ వైరల్ వీడియో వివరాల్లోకెళితే.. క్రిస్‌మ‌స్ ఐలాండ్‌ సమీపంలోని అడ‌వి నుంచి వెస్టర్న్‌ ఆస్ట్రేలియాలో ఉన్న ఓ పార్క్ తీరం వైపు ఏటా వేల సంఖ్యలో క్రాబ్స్ వెళ్తుంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో అక్కడ అడవుల్లో వానలు కురవడం ఆగిపోయిన తరువాత ఇవి సముద్రంలోకి వెళ్లిపోతాయి. అలా వెళ్లాలంటే క్రిస్మస్‌ ఐటాండ్‌లోని రోడ్లు, బ్రిడ్జిల మీదుగానే వెళ్లాలి.

ఈ సారి కూడా పీతలు అలాగే వెళ్లాయి. అయితే ఈ సారి మాత్రం వాటి సంఖ్య ఏకంగా కోట్లలో ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు దాదాపు 5 కోట్ల పీత‌లు ఉన్నట్లు తెలుస్తోంది. క్రిస్ మస్ లో రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్ల మీదకు ఒక్కసారిగా పీతలు ఎగ‌బడ్డాయి. కోట్ల సంఖ్యలో వచ్చిన పీతలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లను విడిచి బయటకు రావడడానికి భయపడిపోతున్నారు. చివరకు రోడ్లు కూడా మూసి వేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)