ఉక్రెయిన్‌పై ర‌ష్యా బాంబుల దాడితో, మిసైళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఎక్కడికక్కడ మిల‌ట‌రీ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసింది. తాజాగా రాజధాని కీవ్ లోకి ప్రవేశించింది. ఇప్పుడు ఉక్రెయిన్‌ను చెందిన ఓ సైనికుడు విడుద‌ల చేసిన సందేశం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌ అవుతోంది. ఓ వీడియోలో సైనికుడు త‌న కుటుంబ స‌భ్యుల‌కు సందేశాన్ని పంపాడు. మామ్, డాడ్ ఐ ల‌వ్ యూ.. అంటూ అత‌ను పేర్కొన్నాడు. 13 సెకన్ల వీడియోలో సైనికుడు తన కుటుంబానికి సందేశం ఇస్తున్నట్లు కనిపించాడు. ఈ వీడియోపై నెటిజ‌న్లు స్పందించారు. ఉక్రెయిన్ సైనికుల ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేశారు. మీరేవ‌రో మాకు తెలియ‌దు.. కానీ మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్నాము అని ఉక్రెయిన్ సైనికుల‌ను ఉద్దేశించి నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ర‌ష్యా ప్రారంభించిన యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన‌ 137 మంది పౌరులు చ‌నిపోయినట్లు ఆ దేశ అధికార‌ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)