తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ అసంతృప్తి గళం వినిపిస్తోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా లేఖలు సంధించడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కాగా, జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రంగంలోకి దిగారు. వీహెచ్ ను జగ్గారెడ్డి ఓ హోటల్ లో కలిశారు. అయితే, అక్కడే ఉన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్... జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని మరీ బతిమాలడం వీడియోలో కనిపించింది. రాజీనామా చేయబోనని ప్రకటిస్తేనే కాళ్లు వదులుతానని బొల్లి కిషన్ పేర్కొన్నారు. నువ్వు పైకి లెగు అంటూ జగ్గారెడ్డి... నువ్వు చెబుతానంటే నేను లేస్తా అంటూ బొల్లి కిషన్... వీడియోలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఇదంతా ఓ సోఫాలో కూర్చుని వీహెచ్ చూస్తూనే ఉన్నారు. ఆయన ఈ తతంగంపై తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)