Patna, May 5: విధుల్లో ఉన్న సమయంలో ఓ స్టేషన్ మాస్టర్ (Station Master) నిద్రపోవడంతో ఓ ఎక్స్ ప్రెస్ రైలు (Express Train) అరగంట పాటు నిలిచిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ (Uttarpradesh) లోని ఎటావా సమీపంలో ఉడిమోరి జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పట్నా- కోటా మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలు మే 3న ఉడిమోర్ జంక్షన్ స్టేషన్ కు చేరుకుంది. అయితే, అక్కడ రాత్రివేళ విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు, గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో రైలును లోకో పైలట్ అక్కడే అరగంట పాటు ఆపేశాడు. దీంతో రైలు లోపలి ఉన్న ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే అధికారులు.. అతడి నుంచి వివరణ కోరారు.
Station Master Dozes Off On Duty, Delays Patna-Kota Express Train Near UP https://t.co/zwPPzZXAzV pic.twitter.com/HUwT2AS1ji
— NDTV (@ndtv) May 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)