వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కాలనీలు, ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. ఈ వర్షాలకు ఓ కుటుంబం తమ నెలల పసిపాపను వరద నీటి నుంచి రక్షించేందుకు పడ్డ కష్టం బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని తలపించింది. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును కుటుంబ సభ్యులు బుట్టలో పెట్టుకొని తరలించారు. భుజాల వరకు వచ్చిన నీటిలో చిన్నారిని ఉంచిన బుట్టను తల్లిదండ్రులు తమ తలపై ఉంచుకుని అడుగులో అడుడేస్తూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. మంథని పట్టణంలో వరద పరిస్థితి తీవ్రతను ఈ దృశ్యాలు కల్లకు కడుతున్నాయి.
పెద్దపల్లి జిల్లా :
మంథని పట్టణంలోని మర్రివాడ లో వరదలో చిక్కుకున్న మూడు నెలల చిన్న బాబు ను బుట్టలో పెట్టుకొని తీసుకువస్తున్న దృశ్యం బాహుబలి సినిమా ను తలపిస్తుంది pic.twitter.com/BX8YLxo0sb
— keshaboina sridhar (@keshaboinasri) July 14, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)