ఆశ పడడంలో తప్పులేదు కానీ అత్యాశ పనికిరాదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో రూ.వెయ్యి పెట్టుబడి పెట్టి చిటికెలో రూ.లక్ష సంపాదించుకోవచ్చని చెబుతున్నది పూర్తిగా అబద్ధమని చెప్పారు. 99 రెట్లు లాభం వస్తుందని చెబితే నమ్మి మోసపోవద్దని అన్నారు.
ఇలాంటి వీడియోలతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు విసిరే వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. వీడియోలో చూపించిన నోట్ల కట్టలు చూసి అత్యాశకు పోవద్దన్నారు. ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడి జీవితాలను ఛిద్రం చేసుకోకండంటూ సజ్జనార్ హితవు పలికారు. అత్యాశకు పోతే చివరికి బాధ, దుఃఖమే మిగులుతాయనే సత్యం గుర్తించాలని చెప్పారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా ముందే జాగ్రత్తగా ఉండటం ఉత్తమమని వివరించారు. నోట్ల కట్టలతో అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగ్ మాయగాళ్ల గురించి మీకు తెలిస్తే వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.
డాక్టర్ నిర్లక్ష్యం.. నాలుగురోజుల పసికందు మృతి.. వికారాబాద్ లో దారుణం (వీడియోతో)
Sajjanar Warns Against Online Betting Apps
వామ్మో..! రూ.వెయ్యి పెట్టుబడికి చిటికెలో రూ.లక్ష రాబడా!? అంటే 99 రెట్లు లాభమా?! ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా అసలు.
ఇలా నోట్ల కట్టలు చూపించగానే నిజమే అనుకుని అత్యాశకు పోకండి. సోషల్ మీడియాలో మీ కంట పడే ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి ఏరి కోరి ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడకండి.… pic.twitter.com/kmrYV12McP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)