భారీ వర్షాలకు తిరుపతి మరో చెన్నైగా మారింది. తిరుపతి లీలా మహాల్ సర్కిల్ నుంచి మంగళం, బీటీఆర్ కాలనీల దాకా జల ప్రళయంతో భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. రోడ్డుపై నడవాలంటే నలుగురి సాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యువకులు బృందంగా ఏర్పడి జనాన్ని రోడ్డు దాటిస్తున్నారు. నడుంలోతు నీళ్ళలో నడిచి వెళ్ళలేక.. జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఇక శ్రీవారి చెంత నుంచి కిందకు గంగమ్మ తల్లి ఉప్పొంగి ప్రవహించింది.  అలిపిరి మెట్ల మీద నుంచి వరద నీరు కిందకు భారీగా పోటెత్తింది. శ్రీవారిని చేరుకునేందుకు ప్రయాణికులు వెళ్లే కాలిబాట పూర్తిగా వరదనీటితో జాలువారింది. భారీ వర్షం ధాటికి అలిపిరి గేట్లు మూసివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)