ఓ వెడ్డింగ్ జంట చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేబ్-అంబిర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ కావడంతో ఫైర్ స్టంట్ చేశారు. స్టంట్‌ ప్రారంభించే ముందు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒకచోట నిలుచున్నారు. ఇంతలో ఓ వ్యక్తి అంబిర్ కుడి చేతిలో పట్టుకున్న ఫ్లవర్ బొకేకి నిప్పంటించాడు. క్షణాల్లో ఆ మంటలు వధూవరుల వీపు భాగంలోకి వ్యాపించాయి. అలానే రెండడుగులు ముందుకు నడిచిన జంట... ఆ తర్వాత చిన్నగా పరిగెత్తారు.

కొద్ది దూరం పాటు పరిగెత్తి.. ఒకచోట మోకాళ్లపై కూలబడ్డారు. వెనకాలే పరిగెత్తుకొచ్చిన ఓ వ్యక్తి వెంటనే మంటలార్పేశాడు. ఈ కొత్త జంట చేసిన ఫైర్ స్టంట్‌కి వెడ్డింగ్ రిసెప్షన్‌కి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. గేబ్, అంబిర్ ప్రస్తుతం హాలీవుడ్‌లో స్టంట్ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు. అందుకే ఇంత అలవోకగా... ఎటువంటి బెరుకు లేకుండా ఆ స్టంట్ కానిచ్చేశారు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ రస్ పావెల్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)