పెళ్లి మండపం మీద పెళ్లి కూతురును ఓ పెళ్లి కొడుకు చిత‌క‌బాదాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో పెళ్లి తంతు ముగిసిన త‌ర్వాత పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురుకు స్వీటు తినిపించ‌బోయాడు. అయితే పెళ్లి కూతురు మొహం చాటేసింది. దీంతో కోపం వ‌చ్చి త‌న ముఖం మీద‌నే స్వీటును విసిరికొట్టాడు పెళ్లికొడుకు.

నా ముఖం మీద‌నే స్వీటు విసిరికొడ‌తావా అని కోపంతో పెళ్లికూతురు ప్లేట్‌లో ఉన్న మ‌రో స్వీటును తీసుకొని అత‌డి మీద విసిరేసింది. దీంతో పెళ్లికొడుకుకు కోపం వ‌చ్చి వ‌ధువుపై విరుచుకుప‌డ్డాడు. త‌న‌ను చిత‌క‌బాదాడు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.నెటిజ‌న్లు దీనిపై విభిన్నంగా స్పందిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)