ముద్దు విషయంలో వధూవరుల మధ్య పెళ్లి వేదికపై చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేదికపై వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటున్నారు. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేసింది. అనంతరం వరుడి వంతు వచ్చింది. అతను దండ చేతిలో పట్టుకుని వధువు చెవిలో గుసగుస చెప్పాడు. అందుకు వధవు వద్దని అడ్డంగా తల ఊపింది. అయినా తర్వాత వరుడు చేసిన చిలిపి పనిని బట్టి అతడు ముద్దు అడిగాడని అర్థమవుతున్నది.

ఎందుకంటే వధవు వద్దువద్దని వారిస్తూ వెనక్కి వెళ్తున్నా వరుడు పట్టుబట్టి ఆమె చెక్కిలిపై ముద్దు పెట్టేశాడు. అనంతరం ఆమె మెడలో పూలమాల వేశాడు. ఈ చిలిపి వీడియోను @ChapraZila అనే ఎక్స్‌ (X) హ్యాండిల్‌లో షేర్ చేశారు. కేవలం కొన్ని సెకన్‌ల నిడివి మాత్రమే కలిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఏకంగా 83 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)