రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఝలావార్‌లో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ.. బీజేపీ కార్యాలయం దాటుతుండగా ఆ భవనంపై ఉన్న కాషాయ కార్యకర్తలకు ఫ్లైయింగ్ కిస్సెస్(ముద్దులు) వర్షం కురిపించారు.వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజునే.. ఈ విధంగా ప్రవర్తించటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ గాంధీ ముద్దుల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రాహుల్‌తో పాటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, ఆర్‌పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోటస్రా, సచిన్ పైలట్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సుమారు 12 కిలోమీటర్ల యాత్ర తర్వాత దేవరిఘాటాకు చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత 3.30 గంటలకు తిరిగి ప్రారంభమయ్యే యాత్ర మోరు కలాలన్ ఖేల్‌కు చేరుకుంటుంది.
Here's Video
नफ़रत का जवाब सिर्फ़ मोहब्बत है !!❤️??
ये तस्वीर देखिये..?? pic.twitter.com/IHkagK97xW
— Rajasthan Youth Congress (@Rajasthan_PYC) December 6, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)