Chennai, March 31: చెన్నైలోని (Chennai) మ‌హిళా క్రిస్టియ‌న్ కాలేజీ యాజమాన్యం (Womens Christian College) ఓ ఫన్ యాక్టివిటీని నిర్వహించింది. కాలేజీలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’ (No Bag Day) అని ప్రకటించింది. అంటే బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. చాన్స్ దొరికిందని అమ్మాయిలు తమ క్రియేటివిటీని బయటపెట్టారు. పుస్తకాలు తప్ప మిగతావన్నీ కాలేజీకి పట్టుకొచ్చారు. కొందరైతే ప్రెషర్ కుక్కర్లు తీసుకొచ్చారు. ఇంకొందరు బకెట్లు, సూట్ కేస్ లు, లాండ్రీ బాస్కెట్స్‌, షూ బాక్స్‌ లు వంటివి కాలేజీకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్ అవుతోంది. 17 లక్షల మందికి పైగా చూశారు. 1.3 లక్షల మంది లైక్ కొట్టారు. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు.

Layoffs In Virgin Orbit: 85 శాతం స్టాఫ్ ను తొలగించనున్న వర్జిన్ ఆర్బిట్

 

View this post on Instagram

 

A post shared by Wins & Ifra (@vaazhka_dude)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)