కేరళ (Kerala)లోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి విలయతాండవం చేసింది.అర్ధరాత్రి వేళ గ్రామాలపై కొండచరియలు, బురద విరుచుకుపడటం (Wayanad Landslides)తో 84 మంది సజీవ సమాధి అయ్యారు. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తాజాగా వయనాడ్‌ కొండచరియల బీభత్సంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి బండరాయిని పట్టుకుని తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.  వయనాడ్ మృత్యుఘోషను తెలిపే లేటెస్ట్ వీడియోలు ఇవిగో, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్

ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి కొంతదూరం తర్వాత బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు బురద కారణంగా అక్కడినుంచి బయటపడలేకపోయాడు. కనీసం నిలబడలేని పరిస్థితుల్లో బండరాయిని పట్టుకుని అలాగే ఉండిపోయాడు.ఆయనను గమనించిన కొందరు స్థానికులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా పరిస్థితులు అందుకు సహకరించలేదు. దీంతో ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాలను పంపించాలని అధికారులను కోరారు. తక్షణమే స్పందించిన సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని రక్షించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)