టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న క్రీడాకురులు పీవీ సింధు, ఆర్‌ సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను సీఎం జగన్‌ అందజేశారు.

విశాఖపట్నంలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను సీఎం జగన్‌ పీవీ సింధుకి అందించారు. అదే విధంగా రజనీ(ఉమెన్స్‌ హకీ) బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్‌ ఉద్యోగులు వెంకట రమణ, జూన్‌ గ్యాలియో, రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)