టోక్యోలో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ రజతం దక్కించుకున్నారు. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఆమె భారత్ నుంచి ఈ స్థాయి వరకూ చేరిన తొలి ప్యాడ్లర్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈరోజు జరిగిన ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి యింగ్​ ఝోతో పోటీపడ్డారు. తొలి గేమ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన భవీనాబెన్ తరువాత వెనుకంజ వేశారు. పసిడి పోరులో చైనా క్రీడాకారిణి యింగ్​ ఝో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలయ్యారు. దీంతో భవీనాబెన్‌ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే టోక్యో పారాలింపిక్స్‌లో రజతాన్ని దక్కించుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా భవీనాబెన్‌ నిలిచారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)