భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రానున్న దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది.2023-24 దేశవాళీ సీజన్ జూన్ 28న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌తో ప్రారంభం కానుంది. రంజీ ట్రోపీ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మొదలవనున్నది. గత సీజన్‌లో సౌరాష్ట్ర జట్టు బెంగాల్‌ను ఓడించి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఇక ఆరు ప్రాంతీయ జట్ల ప్రాంతీయ జట్ల మధ్య దులీప్‌ ట్రోఫీ జరుగనున్నది. ఆ తర్వాత దేవధర్‌ ట్రోఫీ లిస్ట్‌-ఏ టోర్నమెంట్‌ (జూలై 24-ఆగస్టు 3), ఇరానీ కప్ (అక్టోబర్ 1-5), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పురుషుల T20 నేషనల్ ఛాంపియన్‌షిప్ (అక్టోబర్ 16-నవంబర్ 6), విజయ్ హజారే వన్డే ట్రోఫీ (నవంబర్ 23-డిసెంబర్ 3) టోర్నమెంట్‌ జరుగనున్నది.అలాగే అక్టోబర్ 19 నుంచి నవంబర్‌ 9 వరకు జాతీయ వుమెన్స్ టీ20 ఛాంపియన్‌షిప్‌తో ప్రారంభంకానున్నది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 4 వరకు ఇంటర్ జోన్ T20 ట్రోఫీ, సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ జనవరి 4 నుంచి 26 వరకు జరగనుంది.

Here's Shedule

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)