ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో తొలి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(798పరుగులు) పేరిట ఉన్న రికార్డును.. 9 ఇన్నింగ్స్‌లలో అతడు 807 పరుగులు సాధించి బ్రేక్ చేశాడు.న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్ కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఇది అతడికి నాలుగో టెస్టు సెంచరీ కావడం గమానర్హం.ఇప్పటివరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 100.8 సగటుతో 807 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండడం విశేషం. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు నష్టపోయి 315 పరుగులు చేసింది. క్రీజులో రూట్(101),బ్రూక్ (184) పరుగులతో ఉన్నారు.
Here's Update
Harry Brook becomes the first player to score 800 runs in his first nine Test innings. They've come off just 803 balls.
A very special talent ✨ pic.twitter.com/XozHjdiPqe
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)