బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో తొలి రోజు భారత్‌ 109 పరుగులకే ఆలౌట్‌ కాగా.. 156/4 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకే అలౌట్ అయింది. 88 పరుగుల వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 18 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే తొలి ఓవర్‌లో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఎడమ చేతి చూపుడు వేలు నుంచి రక్తం కారుతున్నా, ప్యాంట్‌కు తుడుచుకుని బౌలింగ్‌ను కొనసాగించాడు. స్టార్క్‌కు తగిలిన గాయాన్ని హైలైట్‌ చేస్తూ కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో హంగామా చేస్తున్నారు. రక్తం కారుతున్నా, ఏ మాత్రం వెరవకుండా బౌలింగ్‌ చేస్తున్నాడు.. ఆసీస్‌ ఆటగాళ్ల కమిట్‌మెంట్‌పై ఎప్పుడూ డౌట్‌ పడకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Here's Update

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)