దక్షిణాఫ్రికా వరుస విజయాలకు భారత్‌ బ్రేక్‌ వేసింది. సిరీస్‌లో గెలిస్తేనే నిలువాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో రిషబ్‌పంత్‌ నేతృత్వంలోని భారత్‌ సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీని ద్వారా ఐదు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టి ప్రస్తుతం సిరీస్‌లో 1-2తో నిలిచింది. తొలుత భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 179/5 స్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. మూడు కీలక వికెట్లు తీసిన చాహల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)