India U-19 vs Afghanistan U-19, Asia Cup Highlights: అండర్‌-19 ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ జమ్షీడ్‌ జద్రాన్‌ 43 పరుగులు,  ముషీర్‌ ఖాన్‌ 48 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాజ్‌ లింబానీ, కులకర్ణి తలా మూడు వికెట్లు, నమాన్‌ తివారీ రెండు వికెట్లు సాధించాడు.

వికీపీడియాలో అత్యధికంగా వీక్షించిన పేజీ విరాట్ కోహ్లీదే, ట్వీట్ ఇదిగో..

అనంతరం 174 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 37.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కులకర్ణి(70) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. అతడితో పాటు ముషీర్‌ ఖాన్‌ 48 పరుగులతో రాణించాడు.  ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో డిసెంబర్‌ 10న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)