రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ని రవీంద్ర జడేజా సూపర్ డెలివరీతో పెవిలియన్ కు పంపిన వీడియో వైరల్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్‌.. భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్బుతమైన బంతికి బుక్కయ్యాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ వేసిన జడేజా తొలి బంతిని గుడ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్సీ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి తక్కువ ఎత్తులో బౌన్స్‌ అయ్యి స్టోక్స్‌ ఫ్రంట్‌ప్యాడ్‌ను తాకింది. వీడియో ఇదిగో, జానీ బెయిర్‌ స్టో‌ని వెనక్కి పంపిన అశ్విన్, ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు

వెంటనే ఎల్బీకి అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ సైతం అంతే వేగంగా ఔట్‌ అంటూ వేలు పైకెత్తాడు. స్టోక్స్‌ కనీసం రివ్యూ కూడా తీసు​కోకుండానే మైదానాన్ని వీడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లకు ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ ఆకాష్‌ దీప్‌ 3 వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు.

Heres' Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)