ఐపీఎల్‌-2022 భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ కేవలం 54 బంతుల్లో 92 పరుగులు చేసి సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చకున్నాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా గతేడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్‌కు జట్టుతో విభేదాలు ఏర్పాడ్డాయి. దీంతో టోర్నీ మధ్యలోనే కెప్టెన్సీ పదవి నుంచి తొలిగించారు. అంతేకాకుండా జట్టులో పూర్తిగా చోటు కూడా కోల్పోయాడు. ఇక ఐపీఎల్‌-2022 వేలంలోకి వచ్చిన డేవిడ్‌ వార్నర్‌ను రూ. 6 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. తాజాగా మ్యాచ్‌కు ముందు వార్నర్‌.. ఎపస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇద్దరూ ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. అంతేకాకుండా మ్యాచ్‌ అనంతరం విలియమ్సన్‌తో వార్నర్‌ సెల్ఫీ కూడా దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Delhi Capitals (@delhicapitals)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)