హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్-2024 సీజన్ 57వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 167 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ 75 పరుగులు, ట్రావిస్ హెడ్ 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేస్తే, అభిషేక్ శర్మ ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు కొట్టారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. నిచోలస్ పూరణ్ 48, ఆయుష్ బదోనీ 55 పరుగులతో నాటౌట్‌గా నిలిస్తే, సారధి 29, క్రుణాల్ పాండ్యా 24 పరుగులు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)