ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన రసవత్తర పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. , పంజాబ్‌-ముంబై జట్ల మధ్య మ్యాచ్‌ అనంతరం మైదానంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో పంజాబ్‌ బ్యాటింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ సచిన్ టెండూల్కర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా పాదాలకు నమస్కారం చేయబోయాడు. ఈ హఠాత్పరిణామంతో ఆశ్చర్యపోయిన సచిన్‌ వెంటనే తేరుకుని జాంటీని వారించాడు. అనంతరం ఇరువురు ఆత్మీయంగా హత్తుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)