రషీద్‌ ఖాన్‌ టి20 క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ అందుకున్నాడు. ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్‌ తొలి స్థానంలో ఉన్నాడు. 2022 ఏడాదిలో రషీద్‌ ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 40 వికెట్లతో తొలిస్థానం.. సందీప్‌ లమిచ్చానే 23 మ్యాచ్‌ల్లో 38 వికెట్లతో రెండు, డ్వేన్‌ బ్రావో 19 మ్యాచ్‌ల్లో 34 వికెట్లతో మూడు, జాసన్‌ హోల్డర్‌ 17 మ్యాచ్‌ల్లో 29 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక రషీద్‌ లక్నోతో మ్యాచ్‌ ద్వారా తన ఐపీఎల్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు. లక్నోతో మ్యాచ్‌లో 3.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకముందు 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై(3 వికెట్లు/7 పరుగులు), పంజాబ్‌ కింగ్స్‌పై(3 వికెట్లు/12 పరుగులు) బెస్ట్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)