లాహోర్‌ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ లో పాకిస్తాన్ మహిళా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్‌ మహిళల జట్టు సంచలనం నమోదు చేసింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ఐర్లాండ్‌ కైవసం చేసుకుంది.కాగా విదేశీ గడ్డపై టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఐర్లాండ్‌కు ఇదే మొదటిసారి. నేడు ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఐరీష్‌ బ్యాటర్లలో గాబీ లూయిస్ 71 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. హంటర్‌(40) ,ఓర్లా ప్రెండర్‌గాస్ట్(37) పరుగులతో రాణించారు.

పాక్‌బౌలర్లలో నిదా ధార్‌, సందూ, ఫాథిమా తలా వికెట్‌ సాధించారు. ఇక 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 133 పరగులకే కుప్పకూలింది. పాక్‌ బ్యాటర్లలో జవేరియా ఖాన్‌(50) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఐర్లాండ్‌ బౌలర్లలో డెలానీ, కెల్లీ తలా మూడు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించగా.. జేన్ మాగైర్ రెండు, రిచర్డ్‌సన్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)