బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య శనివారం జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో బంగ్లా వికెట్ కీపర్ లిట్టన్ దాస్ వికెట్ కీపింగ్ అభిమానుల మనసు గెలుచుకుంది. వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని డైవ్ చేస్తూ అందుకున్న దాస్.. అదే వేగంతో బంతిని వికెట్ల వైపు విసిరిన విధానం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని గుర్తుచేస్తోంది. ఆఖరి టీ20 మ్యాచ్లో ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించిన దసున్ షనాకాను దాస్ కళ్లు చెదిరే వేగంతో రనౌట్ చేసి పెవిలియన్ కు పంపించాడు. కాగా, ఈ మ్యాచ్ లో 146 పరుగులకే ఆలౌట్ అయి బంగ్లా జట్టు ఓటమి పాలయింది.ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టు 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచులు ఆడనుంది. ఇదే మ్యాచ్ లో శ్రీలంక బౌలర్ నువాన్ తుషార మెయిడిన్ ఓవర్ వేసి హ్యాట్రిక్ వికెట్ తీశారు. రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన రోహిత్ శర్మ, స్థాయికి తగ్గట్లు ఆడటం లేదనిపిస్తే నిష్క్రమిస్తా!
Here's Video
Litton MS Das
— NeatObserver-Rucha (@NeatObserver) March 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)